calender_icon.png 12 January, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

16-09-2024 12:02:46 AM

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15: భార్య కాపురానికి రాకపోగా తనపై కేసు పెట్టిందన్న మనస్థాపంతో భర్త ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని శ్రీశైలం సున్నిపెంటకు చెందిన రఫీ (32) అక్కడే ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతను కొన్నేళ్ల క్రితం లావణ్య అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, ఈ మధ్యకాలంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. పిల్లలు కూడా కాకపోవడంతో ఈ గొడవలు తారస్థాయికి చేరాయి. దీంతో లావణ్య శ్రీశైలం పోలీసు స్టేషన్ లో 498(ఏ) కింద కేసు పెట్టింది.

అప్పటి నుంచి ఇద్దరు వేరుగా ఉంటున్నారు. లావణ్య హైదరాబాద్ నగరానికి వచ్చి అరబిందో ఫార్మసీ కంపెనీలో జాబ్ చేస్తూ మియాపూర్ డివిజన్ బీకే ఎన్‌క్లేవ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటుంది. అయితే, లావణ్య అడ్రస్ కనుక్కోని నగరానికి వచ్చిన రఫీ.. ఆదివారం ఆమె ఉంటున్న హాస్టల్‌కు ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.