- మనస్పర్థలే కారణం?
- సిరిసిల్లలో దారుణం
సిరిసిల్ల, నవంబర్ 14 (విజయక్రాంతి): కొద్ది రోజులుగా దంపతుల మధ్య ఏర్పడ్డ మనస్పర్థలతో భార్యను హత్య చేసి, భర్త ఆత్యహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన ముదాం వెంకటేష్(41), వసం త (37) దంపతులు. వీరికి కూతురు వర్షిణి, ఏడో తరగతి చదువుతున్న కొడుకు అజిత్ ఉన్నారు. వసంత స్థానిక తపాలా ఆఫీస్‌లోని ఆధార్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నది. వెంకటేష్ చేనేత కూలీగా పని చేస్తుండేవాడు.
అయితే వెంకటేష్, వసంత మధ్య కొద్ది రోజులుగా మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. బుధవారం తన తమ్ముడు ఇంట్లో కార్తీక మాసం వ్రతం నిర్వహించగా వెంకటేష్, వసంత పాల్గొన్నారు. అనంతరం నర్సింగ్ కాలేజీ సమీపంలో ఉన్న తమ పొలం వద్దకు వెళ్లారు. అక్కడ వారి మధ్య గొడవ తలెత్తగా వెంకటేష్ తన వెంట తెచ్చుకున్న బీములు నింపే కోలతో కొట్టి వసంతను హత్య చేశా డు.
అనంతరం డైయింగ్‌లో కలిపే రసాయ నం తీసుకుని వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రయినా ఇద్దరూ తిరిగి రాకపోవ డంతో కుటుంబ సభ్యులు వారి కోసం వెతికారు. గురువారం పొలం వద్దకు వెళ్లి చూడ గా ఇద్దరు విగత జీవులుగా కనిపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కృష్ణ తెలిపారు.