11-12-2024 02:03:11 AM
చేవెళ్ల, డిసెంబర్ 10: కుటుంబ కలహాలతో నేపథ్యంలో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చేవెళ్ల మండలం లో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారంధర్మసాగర్ గ్రామానికి చెందిన విజయ్‌కుమార్(33)కు భార్య సుమలతతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఒకసారి టవర్ కూడా ఎక్కాడు. మంగళవారం ఉదయం భార్యతో గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో విజయ్‌కుమార్ కల్లు కాంపౌండ్‌కు వెళ్లి కల్లుతాగాడు. ఆ తర్వాత తాను చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్‌కుమార్ తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు. కాగా ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.