calender_icon.png 13 March, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మటన్ వండలేదని భార్యను కిరాతకంగా చంపిన భర్త

13-03-2025 12:25:57 AM

మహబూబాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): మానవత్వం మంట కలిసిపో తుంది కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా చిన్నచిన్న విషయాలకి హత్యలు చేసుకుంటూ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు తాజాగా ఇలాంటి ఓ ఘటన మహబూబాబాద్ జిల్లా శిరోలు మండలం ఉప్పరిగుడం గ్రామ శివారు మంజ తండాలో బుధవారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే మానుకోట జిల్లా శిరోల్ మండలం ఉప్పరిగుడం గ్రామ శివారు మంజు తండా గ్రామానికి చెందిన బాలు ఆయన భార్య మాలోత్ కళావతిని మాంసం కూర వండలేదని ఇంట్లో ఎవరు లేని సమయంలో గొడవపడి అతికిరాతకంగా కొట్టి చంపినట్లు మృతురాలి తల్లి ఆరోపిస్తుంది. కాగా ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తుండగా ఇంకా పూర్తి వివరాలు తెలియా ల్సి ఉంది.