04-03-2025 04:03:54 PM
పాల్వంచ,(విజయక్రాంతి): పట్టణంలోని బొల్లారంగూడెంలో వర్తక సంఘం రోడ్ లో నివాసముంటున్న రవీందర్ మంగళవారం భార్య లక్ష్మిపై అనుమానంతో గొడవపడ్డాడు. భార్య లక్ష్మి ఇంటి నుండి బయటికి రాగా.. ఈ క్రమంలో భార్య స్థానిక పోలీస్ స్టేషన్ వెళుతుందనే అనుమానంతో మున్సిపల్ కార్యాలయం వద్ద భార్య నిలుచొని ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్తను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ మహిళను ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా మారడంతో,మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . భర్త రవీందర్ ను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.