ప్రభుత్వానికి ఉపాధ్యాయ పండిత పరిషత్తు విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): భాషా పండితులకు ఖాళీలకు అనుగుణంగా స్పౌజ్ బదిలీలు కల్పించాలని, భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు సీ జగదీశ్, ప్రధానకార్యదర్శి ఎస్ నర్సింలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో బ్లాక్ చేసిన 13 జిలాల్లో భాషా పండితులు, పీఈటీల బదిలీలను గతంలో నిలిపివేశారని, స్పౌజ్ బదిలీల్లో భాగంగా ఖాళీల వివరాలను తెప్పించుకొని వాటిని చేపట్టాలని శుక్రవారం ఒక ప్రకటనలో వారు కోరారు.