calender_icon.png 11 October, 2024 | 7:00 AM

హరికేన్ మిల్టన్ బీభత్సం

11-10-2024 02:19:57 AM

ఫ్లోరిడా రాష్ట్రం అతలాకుతలం

నలుగురు మృతి.. భారీగా ఆస్తి నష్టం

ఫ్లోరిడా, అక్టోబర్ 10: భీకరమైన హరికేన్ మిల్ట న్ అమెరికా తీర రాష్ట్రం ఫ్లోరిడాను అతలాకుతలం చేసింది. మొదటి అత్యంత ప్రమాదకరంగా క్యాట గిరీ 5 హరికేన్‌గా మారిన ఇది.. చివరకు క్యాటగిరీ 3కు తగ్గి ఫ్లోరిడా తీరాన్ని తాకింది. అయినప్పటికీ భారీ ఆస్తి నష్టమే మిగిల్చింది. ఈ జల విలయం ధాటికి నలుగురు వ్యక్తులు చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

భీకరమైన హరికేన్ గాలుల ధాటికి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ప్రఖ్యాత ట్రాపికానా ఫీల్డ్ బేస్‌బాల్ స్టేడియం నామ రూపాల్లేకుండా పోయింది. పైకప్పు పూర్తిగా ఎగరి పోయి ఇనుప చువ్వలు మాత్రమే మిగిలాయి. ఈ హరికేన్ వల్ల ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రజలకు ఈ స్టేడియంలోనే తాత్కాలి బస ఏర్పాటుచేశారు. అది కూడా పూర్తిగా ధ్వంసమైంది.