calender_icon.png 10 October, 2024 | 1:48 PM

ఫ్లోరిడాలో మిల్టన్ హరికేన్ విధ్వంసం

10-10-2024 11:09:26 AM

తల్లాహస్సీ: ఫ్లోరిడాపై హరికేన్ మిల్టన్ విరుచుకుపడ్డాయి. బుధవారంరాత్రి భీకరమైన గాలులు, వర్షంతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ 3 తుఫాను అత్యధిక జనసాంద్రత గత సియస్టాకీ వద్ద తీరాన్ని తాకిందని నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకటించింది. అది ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేస్తుందని గవర్నర్ రాన్ డిసాంటిస్ వ్యాఖ్యానించారు. వీధులు జలయమం, టోర్నోడోలు బీభత్సం సృష్టించిన దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. రెండు వారాలలోపే ఈ ప్రాంతాన్ని తాకిన రెండో అతిపెద్ద హరికేన్ ఇది. భారీ వర్షాలు, టోర్నడోలు, బలమైన గాలులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టం కలిగించాయి.