calender_icon.png 16 March, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో తుపాను బీభత్సం.. 26 మంది మృతి

16-03-2025 10:50:22 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): అమెరికాలో తుపాను బీభత్సం సృష్టించింది. తుపానుల ధాటికి పలు రాష్ట్రాల్లో ఇళ్లు నేతమట్టం కావడంతో పలువురు గల్లంతయ్యారు. కాన్సాస్ లో ధూళి తుపానుతో 50 వాహనాలు పరస్పరం ఢీకొని ఎనిమిది మంది మరణించారని స్థానిక పోలీసులు తెలిపారు. మిస్సోరీలో పలు ఇళ్లు శిథిలమై 12 మంది మృతి చెందారని  మిస్సోరీ స్టేట్ హైవే పెట్రోల్ నిర్ధారించింది. మిస్సోరీలో పాఠశాలలు, కార్యాలయ భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని, భవనాలు దెబ్బతిన్నాయని, కొన్ని ప్రాంతాలు సుడిగాలులు, ఉరుములు, పెద్ద వడగళ్ల ప్రభావంతో తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు నివేదించారు. ధ్వంసమయ్యాయి. ఆర్కాన్సాస్ లో ముగ్గురు మృతి చెందగా, 29 మందికి గాయాలు కాగా, టెక్సాస్ లో ధూళి తుపానుతో ముగ్గురు మరణించారు. ఒక్లహోమాలో 300 ఇళ్లు ధ్వంసం కాగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి అయింది. మిసిసిపి, లూసియానా, అలబామాలో భారీగా నష్టం కలిగింది. ఈ ధూళి తుపాను 10 కోట్ల మందిని ప్రభావితం చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా బలమైన గాలులు వీచి 130కి పైగా కార్చిచ్చులు, టెక్సాస్, ఒక్లహోమా, మిస్సోరీలో విద్యుత్ సరఫరా 2 లక్షల ఇళ్లకు నిలిచిపోయింది. గవర్నర్ సారా హకబీ సాండర్స్ ప్రతిస్పందించి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆర్కాన్సాస్ ప్రజలను తాను ప్రేమిస్తున్నానని, గత రాత్రి తుఫానుల తర్వాత వారికి అవసరమైన సహాయం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడినట్లు సాండర్స్ పేర్కొన్నారు.