calender_icon.png 4 February, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్ధరాత్రి ఆకలా?

30-01-2025 12:00:00 AM

డైటింగ్ అంటూ చాలామంది ఫుడ్ తక్కువగా తీసుకుంటారు. అయితే దీనివల్ల వేళగాని వేళల్లో ఆకలి వేసి, ఏవి పడితే అవి తినేస్తుంటారు. ముఖ్యంగా అర్ధరాత్రుళ్లు చాలామంది ఆకలి వేస్తుందంటూ కార్బోహైడ్రేట్లు ఉన్న ఫుడ్ తింటుంటారు. దీనివల్ల ఇంకా ఎక్కువ నష్టం కలుగుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే రాత్రిళ్లు ఫ్రూట్స్ తినాలి. వీటిలో పోషకాలు ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

ఆయా కాలాల్లో లభించే దొరికే పండ్లను తింటే కడుపు నిండటంతో పాటు హాయిగా నిద్రపడుతుంది. జొన్నలు, రాగి, కొర్రలతో చేసిన చిప్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని తింటే ఆకలి తీరడంతో పాటు పోషకాలూ అందుతాయి.

మరమరాలను నూనె లేకుండా వేయించుకొని ఉప్పు, కారం కలిపి డబ్బాలో భద్రపరుచుకుంటే అర్ధరాత్రి ఆకలి తీర్చుకోవచ్చు. కాస్త రుచిగా ఉండాలంటే వీటిల్లో వేయించిన పల్లీలు, పుట్నాలు కలపొచ్చు. కానీ ఇలా అర్ధరాత్రి ఆహారం తీసుకోవడం మంచిది కాదు కాబట్టి ప్రతి భోజనంలో ప్రోటీన్లు సరిపడా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. వేళకు పడుకోవాలి.