సచివాలయంలో ఆలయ మాస్టర్‌ప్లాన్, అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
- 16 కిలోల బంగారంతో విమాన గోపురానికి తాపడం
- పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం
- రెండెకరాల్లో బిల్వ వనం విస్తరణ
- ఆలయ అభివృద్ధిపై సమీక్షలో మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, నవంబర్ 14 (విజయ క్రాంతి) : వేములవాడ ఆలయం మరో వందేళ్లపాటు మనగలిగేలా మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని అధికారులను దేవాదా య శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. గురువారం సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణరెడ్డితో కలిసి వేములవాడ ఆలయం మాస్టర్‌ప్లాన్, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. దేవాలయ ప్రాశస్త్యం, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనులు చేపట్టాలన్నారు. టూ, ఫోర్ వీలర్, బస్సుల పార్కింగ్‌కు వేర్వేరు స్థలాలను కేటాయిస్తూ ప్లాన్‌ను రూపొందించాల ని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యార్థులు ఆధ్యాత్మిక వాతావరణంలో విద్యను అభ్యసించేలా వేద పాఠశాలను తీర్చిదిద్దాలని సూచించారు.
బిల్వ వనాన్ని 2 ఎకరాల్లో విస్తరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించా రు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ నిధులతోపాటు, సీఎస్‌ఆర్, దాతల విరాళాలు సేకరిం చేలా కార్యాచరణను అమలు చేయాలన్నా రు. మొక్కులు చెల్లించుకునే భక్తులు, ఇతరులకు వేర్వేరుగా ధర్మగుండం ఏర్పాటు చేయాలన్నారు.
రూ.6 కోట్లతో బంగారు తాపడం..
వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులపై మంత్రి ఆరా తీశారు. భూసేకరణపై సమగ్ర నివేదికను సమర్పించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ను ఆదేశించారు. 3,200 చదరపు అడుగులున్న విమాన గోపురం తాపడానికి 16 కిలోల బంగారం అవసరం అవుతుందని, అందుకు రూ.6 కోట్లు ఖర్చవుతుందని అధికారులు మంత్రికి వివరించారు.
త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లి బంగారు తాపడం పనులను ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో వేములవాడ ఆలయాన్ని దర్శించుకోనున్న నేపథ్యంలో ఆల య మాస్టర్‌ప్లాన్, అభివృద్ధి పనులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తయారు చేయాలని ఆదేశించారు. వెండితో ఉత్సవమూర్తుల విగ్రహాలను తయారు చేసే అంశా న్ని పరిశీలించాలన్నారు.
భక్తుల ఆకలి తీర్చే లా అన్నదాన సత్రాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతు, సిరిసి ల్ల కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, వేములవాడ ఆలయ ఈవో వినోద్, కంచి కామ కోటి పీఠం సలహాదారు గోవింద హరి, స్థపతి ఎన్ వల్లినాయగన్, ప్రధానార్చకుడు ఉమేష్, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు.