calender_icon.png 24 September, 2024 | 5:54 AM

గజానికి వంద.. రిజిస్ట్రేషన్ దందా

24-09-2024 01:54:20 AM

  1. సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి తిమింగలాలు
  2. డాక్యుమెంట్ రైటింగ్ కార్యాలయాలే అడ్డాగా వసూళ్లు

సూర్యాపేట, సెప్టెంబర్ 23 (విజయక్రాం తి): సూర్యాపేట జిల్లాలోని స బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అక్రమ రి జిస్ట్రేషన్లకు నిలయాలుగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. భూముల పత్రాలు సక్ర మంగా లేకున్నా పైసలిస్తే పని చేస్తారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పత్రాల న్నీ సక్రమంగా ఉన్నా ఎంతోకొంత ముట్టచెబితేనే పని అవుతదనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. అక్రమ వసూ ళ్ల తతంగం డాక్యుమె ంట్ రైటర్ కార్యాలయాల్లోనే సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వాని కి చెల్లించే చలనాతో పాటు అధికారుల వా టా కలుపుకొని మొత్త ం సొమ్మును డాక్యూమెంట్ తయారీ ఖర్చు ల కింద వసూలు చేస్తున్నట్టు సమాచారం. 

రోజుకు 120 రిజిస్ట్రేషన్లు 

జిల్లాలో సూర్యాపేటతోపాటు కోదాడ, తుంగతుర్తి, హుజుర్‌నగర్‌లలో సబ్ రిజిస్ట్రా ర్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో రోజుకు 120 రిజిస్ట్రేషన్లు అవుతు ండగా, సూర్యాపేటలో రోజుకు 40 వరకు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. ప్రతి రిజిస్ట్రేషన్‌కు ఆస్తి విలువను బట్టీ కనీసం రూ.2 వేల నుంచి రూ.లక్షల్లో అధికారులు వసూలు చేస్తున్నారని సమాచారం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒక్కో చోట, ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారని సమాచారం. 

రోజుకు రూ.2లక్షల వరకు వసూలు

పత్రాలు సరిగా లేని భూములు, వ్యవసాయ భూములను గజాల్లోకి మార్చడం, గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్ వంటి పనులకు గజానికి రూ.100 తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపణులున్నాయి. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా ఏదో ఒక సాకు చూపి ఎంతో కొంత వసూలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఒక్కో కార్యాలయంలో రోజుకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు అవుతాయని, రోజు వారిగా వచ్చే మొత్తం కార్యాలయంలో పని చేసి ప్రతి సిబ్బందికి వారి స్థాయిని బట్టీ వాటా ఉంటుందని ప్రచారం. ఇటీవల సూర్యాపేట కార్యాలయ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారితో పాటు ఇందుకు సహకరించిన డాక్యుమెంట్ రైటర్‌లను అరెస్ట్ చేశారు.  

డాక్యుమెంట్ రైటింగ్ కార్యాలయాల్లోనే..

రిజిస్ట్రేషన్‌కు వచ్చే వారు నేరుగా కార్యాలయంలో పని చేయించుకునే పరిస్థితి లేదు. డాక్యుమెంట్ తయారు చేసుకుని కార్యాలయానికి వెళ్లినా వివిధ రకాల సాకులు చెప్పి వారి పనిని పూర్తి చేయరు. చేసేదేమీ లేక మధ్యవర్తులను సంప్రదించాల్సిన పరిస్థితి. ఇదే అదునుగా డాక్యుమెంట్ రైటర్లు అధికారులు, ప్రజలకు మధ్యవర్తులుగా అవతారం ఎత్తారు. కార్యాలయ సిబ్బంది, అధికారితో డాక్యుమెంట్ రైటర్లు ఒప్పందం కుదుర్చుకుని రిజిస్ట్రేషన్‌కు సిద్ధం చేస్తారని తెలిసింది. వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా సహకరిస్తున్నారని తెలుస్తున్నది. 

జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలు

సూర్యాపేటలో ఏర్పాటు చేసిన వెంచర్‌లో పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ప్లాట్ కొన్నాడు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయ సమీపంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్ వద్ద పత్రాలు సిద్ధం చేయించాడు. డాక్యుమెంట్ రైటర్ రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పడంతో కొంత మొత్తం ఇవ్వడానికి సదరు వ్యక్తి ఒప్పుకున్నాడు. తర్వాత ఈ భూమికి నాలా కన్వర్సన్ లేదని గజానికి రూ.100 చొప్పున అదనంగా ఇస్తేనే రిజిస్ట్రేషన్ చే స్తారని డాక్యుమెంట్ రైటర్ తెలుపడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది.

కొందరు డాక్యుమెంట్  రైటర్లు ఈ విషయం బయటకు రాకుండా సెటి ల్ చేశారు. జాజిరెడ్డిగూడెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి 356 గజాల ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సూర్యాపేట సబ్ రిజిస్ట్రా ర్ కార్యాలయానికి వచ్చారు. ఇంటి పన్ను, గ్రామ కార్యదర్శి జారీ చేసిన అసెస్‌మెంట్ ధ్రువపత్రంతో డాక్యుమెంట్ తయారు చేయించి రూ.11 వేల చలనా చెల్లించారు. ఇతని వద్ద గజానికి రూ.100 చొప్పున వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేశారు.