11-12-2024 01:41:25 AM
* నిధుల మంజూరుకు మంత్రి కోమటిరెడ్డి హామీ
* ఎమ్మెల్యే కవ్వంపల్లి వెల్లడి
మానకొండూర్, డిసెంబరు 10 (విజయక్రాంతి): రోడ్లు, భవనాల శాఖ ద్వారా మాన కొండూర్ నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం హైదరా బాద్‌లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఎమ్మెల్యే కవ్వంపల్లి వినతిపత్రం అందజేశారు. మానకొండూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు.
మానకొండూర్ నియోజకవర్గంలో గతంలో మంజూ రైన పనులు చాలా వరకు అసంపూర్తిగా మిగిలి ఉన్నాయని, ఆ పనులను వెంటనే చేపట్టేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసి వాటిని పూర్తి చేసేలా చూడాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి కోమటిరెడ్డి మొదటి దశలో రూ.100 కోట్ల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ పనులు పూర్తిచేసేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఇల్లంతకుంట మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి ఉన్నారు.