ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
ఖమ్మం, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఖమ్మం మున్నేరు వరద బాధితులకు ఎంత సాయం చేసినా తక్కువే అవుతుందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి మానవత్వం చూపాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. గురువారం ఆయన నగరంలోని వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులను పరామర్శించారు. నయాబజార్ కళాశాల ఆవర ణలో హైదరాబాద్‌కు చెందిన మదార్ సాబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బొక్కలగడ్డ, రాజీవ్ గృహకల్ప తదితర ప్రాంతాలో పర్యటించి, బాధితుల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు.
అనంతరం మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు అనుగు ణంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు తక్షణ సాయం అందించి, వారికి మనోధైర్యం కల్పించాలని కోరారు. సహాయం అందించే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ శంకరరావు, నాయకులు బాబు, టీఎన్జీ వో మాజీ అధ్యక్షులు రంగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.