calender_icon.png 22 April, 2025 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంటగలిసిన మానవత్వం

19-04-2025 09:34:04 PM

చేను మేసిందని గొడ్డలితో గోవుపై దాడి..

మహబూబాబాద్ (విజయక్రాంతి): గోవు చేను మేసిందని ఆగ్రహించి.. మానవత్వాన్ని కూడా మరిచి ఓ వ్యక్తి గొడ్డలితో గోవు పై దాడి చేసిన అమానుష ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్య తండా (బి) జరిగింది. గ్రామానికి చెందిన బానోతు శంకర్ అనే రైతుకు చెందిన గోవు మాలోతు బాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన జొన్న చేను మేయడాన్ని చూసి గొడ్డలితో బాలకృష్ణ గోవుపై దాడి చేశాడు. ఈ ఘటనలో గోవుకు బలమైన గాయమైంది. ఈ విషయంపై బాధిత రైతు బానోతు శంకర్ దాడి చేసిన మాలోత్ బాలకృష్ణ పై కురవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.