calender_icon.png 15 April, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంటగలిసిన మానవత్వం

11-04-2025 12:21:14 AM

  1. నడి బస్టాండ్‌లో వ్యక్తి మృతి

ఆలస్యమైన 108 అంబులెన్స్ 

ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు 

గోపాలపేట ఏప్రిల్ 10  : జనాల్లో మానవత్వం మంట కలిసిందన్న చందంగా గోపాలపేట బస్టాండ్ నడిబొడ్డును ఓ వ్యక్తి ఫిట్స్ వచ్చి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఏ ఒక్కరు కూడా ఆదరించలేకపోయారు. గోపాలపేట మండల కేంద్రానికి చెందిన మేకల మాసయ్య (70) తన కొడుకుతో ఇంటి నుండి మోటార్ సైకిల్ పై బస్టాండుకు వచ్చారు. పోటీల మా సయ్య శౌరం చేయించుకునేందుకు బస్టాండ్ లోని మంగళ్ షాపుకు వెళ్లారు.

తనకు శౌర్యం చేస్తుండగానే ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. వెంటనే షాప్ యజమాని 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. ప్రభుత్వ అంబులెన్స్ ఆలస్యం కావడంతో పక్కనే ఉన్న ఆటో స్టాండ్ లో ఉన్న కొంతమంది ఆటో డ్రైవర్లు అతనిని చూసి మళ్ళీ వెని తిరిగారు. ఏ ఒక్కరైనా ఆదుకుంటే అతని ప్రాణాలు దక్కేవని పలువురు వాపోయా రు. సమాచారం ఇచ్చిన అంబులెన్స్ రేవెల్లి నుండి గోపాలపేటకు చేరుకోవడానికి సుమారుగా 50 నిమిషాలు పట్టింది.

అంతకుముందు గోపాలపేటలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ మెరుగైన డాక్టర్లు లేకపోవడం. అంతేకాకుండా ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న అంబులెన్స్ కూడా లేకపోయింది. తిరిగి అతనిని ఓ ప్రైవేటు ఆసు పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను చనిపోయి ఉన్నాడని ప్రవేట్ డాక్టర్లు నిర్ధారించారు.

గోపాలపేట మండల కేంద్రం లో ఉన్న ఆస్పత్రిలో తప్పక ఒక అంబులెన్స్ ఉండాలన్న సంకల్పంతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవలే అక్కడ ఉన్న అంబులెన్స్ను జిల్లా కేంద్రానికి పంపించినట్లు డిఎంహెచ్ ఓ శ్రీనివాసులు తెలిపారు.

అత్యవసర సమయంలో అందుబాటులో ప్రభుత్వ అం బులెన్స్ లేకపోవడం ఎక్కడో ఉన్న 108 అంబులెన్స్ లు ఆలస్యంగా రావడం పట్ల ఇలా పేదోళ్ల ప్రాణాలు గాలిలో కలు స్తున్నాయి. మృతుడు పోటీల మాసయ్య కు భార్య ముగ్గురు కుమారులు  ఉన్నారు.. అదేవిధంగా మృతి చెందిన మృతుడి కుటుంబానికి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి 5000 ఆర్థిక సహాయం ను తన అనుచరుల ద్వారా అందజేశారు.