calender_icon.png 23 October, 2024 | 6:54 PM

మానవాళి మనుగడకు నడుం బిగించాలి

23-09-2024 12:00:00 AM

అంతర్జాతీయ యువ సమ్మేళనం ముగింపు సమావేశంలో మంత్రి జూపల్లి

రంగారెడ్డి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మానవాళి మనుగడకు యువత నడుం బిగించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని కన్హ శాంతివనంలో నిర్వహించిన అంతర్జాతీయ యువ సమ్మేళనం ముగింపు సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యువ సమ్మేళనంలో ప్రపంచవ్యాప్తంగా యువత పాల్గొనడం శుభసూచకం అన్నారు.

ప్రస్తు తం ప్రపంచంలో జరుగుతున్న అలజడులు, అశాంతిలకు యువత దూరదృష్టితో చెక్ పెట్టాలని కోరారు. సమాజంలోని సమస్యలకు మనుషుల ఆలోచనలే కారణమని తెలి పారు. యోగా, ధ్యానం ద్వారా అన్ని రుగ్మతలకు చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు. కార్యక్ర మంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రాంచంద్ర మిషన్ సంస్థ అధ్యక్షుడు గురూజీ కమలేష్ పటేల్‌దాజీ, ప్రపంచ బ్యాంక్ ఉపాధ్యక్షుడు మార్టిన్ తదితరులు పాల్గొన్నారు.