calender_icon.png 10 January, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెక్నాలజీ కంటే మనిషి ఆలోచనే ఉత్తమమైంది

10-01-2025 02:04:06 AM

ఐఐఎంసీ రెంండు రోజుల జాతీయ సదస్సులో వక్తలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (విజయక్రాంతి): టెక్నాలజీ కంటే మనిషి ఆలోచనలే ఉత్తమమైనవని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ (ఐఐఎంసీ) చైర్మన్ ప్రొఫెసర్ వీ విశ్వనాథం, పూర్ణచంద్రరావు, ప్రిన్సిపాల్ రఘువీర్ పేర్కొన్నారు. ఐఐఎంసీలో డిజిటల్ ఇన్నోవేషన్స్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రఘువీర్ మాట్లాడుతూ.. తమ సదస్సుకు అమెరికా, లండన్ నుంచి 87 పరిశోధన పత్రాలు వచ్చాయని తెలిపారు. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. మనిషి ఆలోచనతో ప్రతీదాన్ని టెక్నాలజీగా మార్చవచ్చన్నారు. ప్రొఫెసర్ వీ విశ్వనాథం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సుకతతో, ఆలోచనతో పరిశోధన చేసి విశ్లేషణతో పరిశోధన వ్యాసాలను రాసారని తెలియజేశారు.

అనంతరం 87 వ్యాసాలతో కూడిన సంక్షిప్త పరిశోధనా వ్యాస సంపుటిని విడుదల చేశారు. మొదటిరోజు రెండు సెషన్లుగా జరిగిన సదస్సులో వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు వివిధ విభాగాలకు 38 పరిశోధన పత్రాలు సమర్పణ చేశారని సదస్సు కన్వీనర్ కరుణశ్రీ తెలియజేశారు. వారికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రశంసాపత్రాలను అందజేశారు. శుక్రవారం సమావేశం ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని తెలిపారు.