calender_icon.png 24 February, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ సేవే.. మాధవ సేవ

18-02-2025 01:32:50 AM

* జగిని ఫర్నిచర్ అధినేత జగిని శ్రీనివాస్

హైదరాబాద్‌సిటీబ్యూరో, ఫిబ్రవరి 17(విజయక్రాంతి) : మానవ సేవే.. మాధవ సేవ అని జగినీ ఫర్నిచర్ అధినేత జగిని శ్రీనివాస్ పేర్కొన్నారు. మలక్‌పేట నియోజకవర్గం సైదాబాద్ ఎస్‌బీహెచ్ కాలనీ శ్రీనివాస కమ్యూనిటీ హాల్‌లో జగిని శ్రీనివాస్, నాగమల్ల అనిల్‌కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో శృతి, శివకుమార్.. నవనీత, ప్రవీణ్‌ల వివాహం జరిపించారు. నూతన వధూవరుల వివాహానికి తమ వంతు సాయంగా పుస్తెమట్టెలు, పెండ్లి దుస్తులు, సామాగ్రి, పెండ్లిపందిరి, బియ్యం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెళ్లిళ్లు చేసుకోలేని స్థితిలో ఉన్న పేద కుటుంబాలు తమను సంప్రదిస్తే వివాహ ఖర్చులను తమ ఫౌండేషన్ భరిస్తుందన్నారు. జంట పెళ్లిళ్లకు సహకారమందించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. పేదల వివాహాలు చేయడం తమకు కోటి జన్మల పుణ్యంగా భావిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమహేశ్వర్‌రెడ్డి, ఎడవల్లి బాలరాజ్, జెగిని విజయ్, కే వెంకటప్రసాద్, గుబ్బ లింగేశ్వర్‌గుప్తా, కుంచెం నరసింహారావు, కొండా సురేశ్ తదితరులు పాల్గొన్నారు.