calender_icon.png 15 November, 2024 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ హక్కుల నేతలు మాట్లాడాలి

15-11-2024 01:06:28 AM

  1. బీఆర్‌ఎస్ నేత సురేశ్‌కు లగచర్లలో భూమి ఉంది 
  2. సీఎం చెప్పినట్లుగా పోలీసులు పనిచేస్తున్నరు 
  3. మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అరాచ క పాలన సాగిస్తున్నారని, పాలనపై పోరా టం చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడారు.

లగచర్ల భూసేకరణలో ప్రభుత్వం భం గపడిందని, దాని నుంచి బయటపడేందుకే తమపై కుట్రలు పన్నుతున్నదని, అధికారులపై దాడి చేశారంటూ 50 మంది రైతులను ఎస్పీ నారాయణరెడ్డి దగ్గరుండి వారిని కొట్టించారని ఆరోపించారు. ఓ మహిళ ఛాతి మీద కాలు పెట్టి మరీ పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అరాచక పాలనపై మానవ హక్కుల గురించి మాట్లాడే ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించా రు. బీఆర్‌ఎస్ నేత సురేశ్‌కు భూమి లేకపోయినా గొడవ చేశాడని అనడం కేవలం కు ట్రనేన్నారు. వాస్తవానికి సురేశ్‌కు గ్రామంలో భూమి ఉందని స్పష్టం చేశారు. పోలీసులు, ఐపీఎస్ అధికారులంతా సీఎం చెప్పినట్లు చెస్తున్నారని ఆరోపించారు.

పోలీస్ విచారణలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తన పేరు చెప్పాడని, అలానే రిమాండ్ రిపోర్ట్‌లో రాసిఉందనే విషయాన్ని తాము కొట్టిపడేస్తున్నామని తేల్చిచెప్పారు. తనను అరెస్ట్ చేస్తే జైలు నుంచి బయటకు వచ్చాక పోరాటం చేస్తానన్నారు. లగచర్ల కేసులో అరెస్టున రైతులను పోలీసులు కొట్టారని, వారికి కనీసం వైద్యం సైతం అందించలేదని వాపోయారు.

ఇదే సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని, నాడు ఆయన ఫార్మా సిటీతో పల్లెలు కాలుష్యం బారినపడతాయని ప్రచారం చేశారని, నేడు ఆయనే దగ్గరుండి ఫార్మా సిటీ తీసుకొస్తున్నారని విమర్శించారు. సీఎంకు తన సొంత నియోజకవర్గంపై ఏమాత్రం పట్టులేదని ఎద్దేవా చేశారు. కలెక్టర్‌పై దాడి చేసేంత బలమైన వ్యక్తులు బీఆర్‌ఎస్‌లో ఉండరన్నారు.

తాను డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరి ఫోన్లనూ ట్యాపింగ్ చేయలేదన్నారు. అవినీతి అంతకన్నా చేయలేదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నానని, అ లా అయితేనే మున్ముందు బీఆర్‌ఎస్  15 ఏ ళ్ల పాటు అధికారంలోకి ఉంటుందని జో స్యం చెప్పారు.

ఎన్నికల సంస్కరణలు చేసినా ఒక వ్యక్తి రెండు పర్యాయాల కన్నా ఎక్కువ సార్లు సీఎం, పీఎం కాలేరని అభిప్రాయపడ్డారు. తాను ఢిల్లీకి వెళ్లి కేవలం కాంగ్రెస్‌పై ఫిర్యాదు చేశానని, బీజేపీతో తమకు దోస్తీ అవసరం లేదని స్పష్టం చేశారు.

రైతుల కోసం పోరాడతాం..

లగచర్ల కేసులో అరెస్టున రైతుల తరఫున న్యాయపోరాటం చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుల కుటుంబీకులు గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వచ్చి కేటీఆర్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.

భూములు తీసుకోవద్ద ని నిరసిస్తే, పోలీసులు రైతులను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు వారు నడవలేని పరిస్థితిలో ఉన్నారని వాపోయారు. అనంతరం కేటీఆర్ వారితో మాట్లాడుతూ.. రైతులను విడిపించేందుకు బీఆర్‌ఎస్ పోరాడుతుందని భరో సానిచ్చారు.

రైతులపై దాడిని జాతీయ మానవహక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమాటోగా స్వీకరించి విచారణ జరపాలని విజ్ఞప్తి చేశా రు. అలాగే సమస్యను పాలమూరు ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం దృష్టికి లగచర్ల ఘటన వెళ్లేలా చేయాలని సూచించారు.