calender_icon.png 6 March, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యూమన్ రైట్స్ క్యాలెండర్ ఆవిష్కరణ

06-03-2025 12:00:00 AM

నారాయణఖేడ్, మార్చి 5: ఇండియన్ నేషనల్ హ్యుమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ 2025 నూతన క్యాలెండర్లను నారాయణఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి బుధవారం  అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కొఠారి నర్సింలు  హాజరు కావడం జరిగింది.

ఈ సందర్భంగా డిఎస్పి గారు మాట్లాడుతూ ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ బాధితుల పక్షనా నిలబడి న్యాయం కోసం ఇండియన్ నేషనల్ హ్యుమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ టీం బాగ పనిచేయడం మంచి  పరిణామమని అన్నారు. పేద ప్రజలకు, యువతకు న్యాయ చట్టాల పైన అవగాహనలు, ఈ ప్రాంతంలో మరిన్ని మంచి సేవలు చేయాలని టీంకి సూచించారు.

ఈ  కార్యక్రమంలో ఇండియన్ నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డి.ఓం ప్రకాష్ , మెదక్ జిల్లా బాద్యులు సంతోష్ రావు, పాటిల్, బిసి సంఘం అందోల్ డివిజన్ అధ్యక్షులు రాజశేఖర్, శ్రీనివాస్, అవుటి దత్తు, డిఎస్పి రైటర్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.