calender_icon.png 23 December, 2024 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణితంతోనే మానవ జీవితం

22-12-2024 11:14:43 PM

అన్ని సబ్జెక్టులపై ప్రతిభా పరీక్షలు నిర్వహించాలి

ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ జి.రమేశ్

హయత్‌నగర్ జడ్పీ స్కూల్‌లో గణితంపై రాష్ట్రస్థాయి ప్రతిభాపరీక్ష

హాజరైన ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి

ఎల్బీనగర్: గణితంతోనే మానవ జీవితం ప్రారంభమైనది.. గణితం అన్ని శాస్త్రాలకు మూలమని... గణితం నేర్చుకోవడం సులభమని.. పిల్లల్లో సృజనాత్మక వెలికితీయడానికి గణితం ఎంతో దోహపడుతుందని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ జి.రమేశ్ అన్నారు. హయత్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్‌వీవైఎన్‌వైఎస్‌వై సహకారంతో తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ జి.రమేశ్ మాట్లాడుతూ... గణితంపై నిర్వహిస్తున్న ప్రతిభా పరీక్షలను విద్యార్థులకు అన్ని సబ్జెక్టులపై నిర్వహించాలన్నారు. గణితంలో ప్రతిభ చూపిన విద్యార్థి మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో ప్రతిభను చాటుతాడని తెలిపారు.

ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులకు చిన్నప్పటి నుంచే గణితంపై అసక్తి కలిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. గణితంలో పట్టుసాధించే అన్నిరంగాల్లో సత్తా చాటుతారని తెలిపారు. గణితం నేర్చుకోవడం సులభమని, మానవ ఆర్థిక ప్రగతి గణితంపై అధారపడి ఉందని, ప్రతి ఒక్కరూ గణితంపై పట్టుసాధించాలని సూచించారు. రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రతిభా పరీక్షలు విద్యార్థుల్లో భయాన్ని పోగోడుతాయన్నారు. విద్యార్థులకు గణితంపై అసక్తిని పెంపొందించడానికి, ఉపాధ్యాయుల కృషిని ప్రపంచానికి తెలిసేలా చేసేవే ప్రతిభా వేదికలు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తాను ఎంపీపీగా ఉన్నప్పుడు హయత్‌నగర్ జడ్పీ స్కూల్ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని గుర్తు చేశారు. అనంతరం ప్రతిభా పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కందికొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఆర్థిక కార్యదర్శి సతీశ్‌కుమార్, పరీక్షల కన్వీనర్ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి, శ్రీనివాస్, సేవారత్న అవార్డు గ్రహీత నక్క శ్రీనివాస్ యాదవ్‌తో పాటు వివిధ జిల్లాల గణితశాస్త్ర ఉపాధ్యాయులతో పాటు నాయకులు శివకూమార్, జైపాల్‌రెడ్డి, జేబీ గౌడ్, భాను, అస్లాం తదితరులు పాల్గొన్నారు.