calender_icon.png 7 October, 2024 | 7:54 AM

మంథనిలో గన్‌మెన్‌లతో హల్చల్

04-09-2024 11:47:17 AM

సామాన్యులను, వ్యాపరులను భయపెడుతు బ్లాక్ మెయిల్

 వనుళ్ల పర్వానికి తెరతీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని బీఆర్ఎస్ నాయకుడు బొమ్మగాన అనిల్ గౌడ్

మంథని, (విజయక్రాంతి): మంథనిలో గన్మెలతో హల్చల్ చేస్తున్నారని, దీంతో సామాన్యులను ఇటు వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారని వెంటనే సంబందిత అధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకకొవాలని బీఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండల యూత్ అధ్యక్షుడు బొమ్మగాన అనిల్ గౌడ్ ఒక ప్రకటనలో కోరారు. అధికార పార్టీ చెందిన మాజీ మాజీ ప్రతినిధిలు కొన్ని కారణాలతో తమకు ప్రాణహాని ఉండని, ప్రభుత్వ నుండి రక్షణ కోరకు గన్మెన్లను పెట్టుకున్నారని, దీంతో వారు అదే గన్మెన్లను చూపిస్తు సామాన్య ప్రజలను, వ్యాపారులను బ్లాక్ మెయిలు చేస్తున్నారని, మంథని పట్టణంలో రాజకీయాలకు తావు లేకుండా చేసి సామన్య ప్రజలకు రక్షించాల్సిందిగా అనిగౌడ్ అధికారులను కోరారు. ఇప్పటికే  మాజీ ప్రజా ప్రతినిధులు అధిక వసుల్ చేసినట్లు ఎన్నో ఆరోపనలు ఉన్నాయని తెలిపారు.