calender_icon.png 8 January, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుపై దాడినిఖండించిన హెచ్‌యూజే

09-07-2024 02:16:41 AM

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): వెలుగు పత్రిక స్పోర్ట్స్ జర్నలిస్టు కృష్ణారెడ్డిపై కొందరు దుండగులు చేసిన దాడిని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (హెచ్‌యూజే తీవ్రంగా ఖండించింది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తున్న కృష్ణారెడ్డిపై సూరజ్ అనే యువకుడు, అతని స్నేహితుడు దాడి చేసినట్లు హెచ్‌యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీశ్వర్ తెలిపారు. అయితే దాడి చేసిన సమయంలో వారు మద్యం సేవించి ఉన్నారని వెల్లడించారు. ఈ విషయమై శనివారం కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని, అయితే దాడి చేసిన వారికి రాజకీయ నేపథ్యం ఉండటంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసులు వెంటనే స్పందించి దాడి చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.