పీకేఎల్ 11వ సీజన్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పునేరి పల్టన్ భారీ విజయం సాధించింది. నోయిడా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పునేరి పల్టన్ 51-34 తేడాతో బెంగాల్ వారియర్స్‌పై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో పల్టన్స్ 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
పల్టన్ జట్టులో ఆకాశ్ షిండే, మోహిత్ గోయత్‌లు చెరో 9 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. బెంగాల్ తరఫున రెయిడర్ నితిన్ కుమార్ 13 పాయింట్లు సాధించినప్పటికీ లాభం లేకపోయింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 44-42 తేడాతో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది.
యూపీ తరఫున భవానీ రాజ్‌పుత్ సూపర్ 10 సాధించగా.. పట్నా తరఫున దేవాంక్ 18 పాయింట్లతో మెరవగా.. అయాన్ సూపర్ టెన్ సాధించాడు. నేటి మ్యాచ్‌ల్లో పునేరి పల్టన్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబాతో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి.