సంగారెడ్డి: తెంలగాణ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోరుగా కురుస్తున్న వర్షాలకు నల్లవాగు మత్తడి ఎగువ భాగంలోని సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నల్లవాగు మత్తడిలోకి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో నల్లవాగు మత్తడి పొంగిపొర్లుతూ మంజీరా లోకి పరవళ్ళు తొక్కుతోంది. దీంతో మంజీరా ప్రాంతం జలకలను సంతరించుకోవడంతో పాటు మాగి గోర్గల్ వడ్డేపల్లి శివారులోని రైతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.