22-03-2025 12:15:57 PM
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భారీగా విదేశీ మద్యం(Foreign liquor) పట్టుబడింది. ఎక్సైజ్, ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్(Excise and Prohibition Department) ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం బషీర్‌బాగ్‌లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను పట్టుకుని వారి నుండి రూ. 9. లక్షల విలువైన 233 బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. బషీర్‌బాగ్(Basheerbagh) రోడ్డు వద్ద నిఘా ఉంచిన బృందం అనుమానాస్పదంగా కదులుతున్న కారును గమనించి ఆపి తనిఖీ చేసింది. ఢిల్లీ,హర్యానా నుండి నగరానికి అక్రమంగా తరలిస్తున్న 233 బాటిళ్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అధికారులు కనుగొన్నారు. నిందితుల నుంచి కారు, రూ. 35 వేల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు హరీష్ కుమార్(దోమగూడ), విలియమ్స్ జోసెఫ్(సికింద్రాబాద్) చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు, ఈ రాకెట్‌లో పాల్గొన్న వారి నలుగురు సహచరులు పరారీలో ఉన్నారు. ఢిల్లీ మద్యం వ్యాపారులు దీపక్, ధర్మబట్టి సునీల్ పై కేసులు నమోదు చేశారు. ఏడాదిగా ఢిల్లీ నుంచి విదేశీ మద్యం తెప్పించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.