68 రెట్లు బిడ్లు
ముంబై, జూలై 5: రూ.1,952 కోట్ల సేకరణకు ఎమ్‌క్యూర్ ఫార్మా జారీచేసిన ఐపీవోకు భారీ స్పందన లభించింది. బుక్‌బిల్డింగ్ మార్గంలో వస్తున్న ఈ ఐపీవో ముగింపు రోజైన శుక్రవారంనాటికి 68 రెట్లు బిడ్స్ అందాయి. ఈ కంపెనీ షేరుకు రూ.960 ధరల శ్రేణితో ఐపీవోను జారీచేసింది. బీఎస్‌ఈలో పొందుపర్చిన సమాచారం ప్రకారం ఈ ఆఫర్‌కు సంస్థాగత ఇన్వెస్టర్లు 195 రెట్లు అధికంగా బిడ్ చేయగా, హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్ల నుంచి 48.32 రెట్లు బిడ్స్ లభించాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లకుగాను 7.21 రెట్లు బిడ్డింగ్ జరిగింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ.800 కోట్ల విలువైన తాజా ఈక్విటీని జారీచేస్తుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు రూ. 1,152 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్)గా విక్రయించనున్నారు.
భన్సాల్ వైర్‌కు 60 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రిప్షన్
బుక్‌బిల్ట్ మార్గంలో వచ్చిన భన్సాల్ వైర్ ఐపీవో శుక్రవారం ముగిసే సమయానికి 60 రెట్లు బిడ్స్‌ను అందుకున్నది. రూ. 745 కోట్ల సమీకరణ కోసం పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లనే కంపెనీ జారీచేస్తున్నది. కంపెనీ 2.15 కోట్ల షేర్లను ఐపీవోలో ఆఫర్ చేయగా, 12.78 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల కోటా 146 రెట్లు, హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్ల విభాగం 51 రెట్లు, రిటైల్ విభాగం 13.64 రెట్లు చొప్పున ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఈ కంపెనీ షేరుకు రూ.243 ధరల శ్రేణితో ఐపీవోను జారీచేసింది.