calender_icon.png 15 January, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఆఫర్‌కు భారీ స్పందన

12-09-2024 12:40:55 AM

63 రెట్లు సబ్‌స్క్రిప్షన్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: రూ.6,500 కోట్ల సమీకరణకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ జారీచేసిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీవో) ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఐపీవో బిడ్డింగ్‌కు చివరిరోజైన బుధవారానికల్లా 63.60 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఆఫర్‌లో 72.76 కోట్ల షేర్లను జారీచేయగా, 4,627 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చా యి. ముఖ్యంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన విభాగం నుంచి 209 రెట్లు బిడ్స్ అందాయి. హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్ల కోటాలో 41.50 రెట్లు బిడ్స్ అందగా, రిటైల్ ఇన్వెస్టర్ల రిజర్వ్‌చేసిన షేర్లకు 7 రెట్లు సబ్‌స్క్రిప్షన్ లభించింది.

ఈ ఆఫర్ సోమవారం ప్రారంభమైన రోజునే 2 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఆఫర్ ప్రారంభానికి ముందు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 1,758 కోట్లు సమీకరించింది. రూ.66 ప్రైస్‌బ్యాండ్‌తో జారీ అయిన ఐపీవో ద్వారా రూ.3,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయగా, రూ. 3,000 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో మాతృసంస్థ బజాజ్ ఫైనాన్స్ విక్రయిస్తున్నది. తాజా ఈక్విటీ ద్వారా సమీకరించిన నిధుల్ని భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగిస్తారు.