అధిక ధరలే కారణం
ప్రధాన నగరాల్లో లావాదేవీలపై అనరాక్ రిపోర్ట్
న్యూఢిల్లీ, జూలై 21: భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మధ్యకాలంలో దేశంలోని ప్రధాన నగరాల్లో భూ లావాదేవీలు సగానికిపైగా తగ్గాయి. ఈ క్యూ1లో నిరుడు ఇదేకాలంతో పోలిస్తే 57 శాతం క్షీణించి 325 ఎకరాలకు పరిమితమైనట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్ 721 ఎకరాలతో కూడిన 29 ల్యాండ్ డీల్స్ జరగ్గా, 2024 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 325 ఎకరాలతో కూడిన 25 డీల్స్ మాత్రమే జరిగాయని తెలిపింది. భూముల ధరలు భారీగా పెరగడం, లోక్‌సభ ఎన్నికలు జరగడం లావాదేవీలు, వాటి పరిమాణం తగ్గడానికి కారణమని అనరాక్ వివరించింది.
ఈ ఏప్రిల్ అత్యధికంగా 114 ఎకరాలకు 9 లావాదేవీలు బెంగళూరులో నమోదయ్యాయని అనరాక్ గ్రూప్ రీజనల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ చెప్పారు. హైదరాబాద్‌లో 48 ఎకరాలకు సంబంధించి ఒక లావాదేవీ జరిగిందని వెల్లడించారు. గుర్‌గావ్‌లో 77.5 ఎకరాల కోసం ఏడు డీల్స్, ముంబైలో 4.52 ఎకరాలతో కూడిన 2 ల్యాండ్ డీల్స్, పూనేలో 2 డీల్స్ (27.5 ఎకరాలు), చెన్నైలో 1 డీల్ (27 ఎకరాలు), థానేలో 24.95 ఎకరాలకు 2 డీల్స్, అహ్మదాబాద్‌లో 1.37 ఎకరాలకు 1 డీల్ జరిగినట్టు వివరించారు. ఏప్రిల్ త్రైమాసికంలో జరిగిన డీల్స్‌లో 17 రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌కు సంబంధించినవి కాగా, మిగిలినవి వ్యసాయం, డాటా సెం టర్లు, లాజిస్టిక్ పార్క్‌లు, పరిశ్రమలు, రిటైల్ రంగానికి చెందినవి.