calender_icon.png 28 April, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీఎఫ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

28-04-2025 01:33:32 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 27: ఏసీ ఎఫ్ ( ఆల్ కాలనీస్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కొవ్వొతులతో ర్యాలీ తీశారు. పహల్గంలో ఉగ్రవాదుల దాడి దు ర్మార్గం అని ఈ సందర్బంగా నేతలు ఆగ్ర హం వ్యక్తం చేశారు.

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అన్ని దేశాలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్రం వెంటనే పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాద బాధితు లకు అందరూ అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆల్ కాలనీస్ రేషన్ సభ్యులు స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.