calender_icon.png 26 December, 2024 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5న ఉపాధ్యాయుల భారీ బహిరంగ సభ

25-12-2024 12:00:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 5వ తేదీన ఉపాధ్యాయులు, ఉద్యోగులతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ సీపీఎస్‌ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. మంగళవారం ఆయన సంఘం నేతలతో కలిసి హైదరాబాద్‌లో ‘ఆక్రోష్’ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.

ఇటీవల కేంద్ర మంత్రివర్గం యూపీఎస్ విధానానికి ఆమోదం తెలిపిందన్నారు. ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేయనున్న ఏకీకృత పెన్షన్ విధానం అమలు చేయనున్న నేపథ్యంలోనే ఆదిలాబాద్‌లో నిరసన సభ నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డి, మ్యాన పవన్‌కుమార్, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.