calender_icon.png 20 April, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో హనుమాన్ భక్తుల భారీ శోభాయాత్ర

06-04-2025 10:45:55 PM

అలరించిన మహిళల కోలాటాలు..

బెల్లంపల్లి (విజయక్రాంతి): శ్రీరామనవమి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం భక్తుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పట్టణంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. పంచముఖి హనుమాన్ దేవాలయం నుండి కన్నాల ఫ్లైఓవర్ వద్ద గల హనుమాన్ విగ్రహం వరకు హనుమాన్ భక్తులు శోభాయాత్ర చేపట్టారు. శోభాయాత్రలో మహిళల కోలాటం, నృత్యాలు అలరించాయి. పాత బస్టాండ్ మీదుగా కొనసాగిన శోభాయాత్రలో అడుగడుగున మహిళలు నీరాజనాలు పలికారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ నీలాల దేవయ్య ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.