calender_icon.png 18 March, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిట్లం తై బజార్ వేలంలో భారీ ధరలు..

17-03-2025 06:28:51 PM

కైవసం చేసుకున్న ఎల్లారెడ్డి వాసి..

పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం తై బజార్ వేలం ఘనంగా సాగింది. ఎంపీడీవో కమలాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ వేలంలో నలుగురు పాల్గొని హోరాహోరీగా పోటీ పడ్డారు. చివరకు రూ.12.52 లక్షల భారీ ధరకు ఎల్లారెడ్డికి చెందిన రామ గౌడ్ విజయదండం ఎగురవేశారు. ఇదే విధంగా పశువుల వ్యాపారం విభాగంలో ఐదుగురు పాల్గొన్న వేలంలో పత్తి హరీష్ రూ. 6.58 లక్షల భారీ బిడ్డింగ్‌తో గెలిచారు. పంచాయతీ కార్యదర్శి బల్రాం మాట్లాడుతూ... ఈ సంవత్సరపు ధరలు గత ఏడాది కన్నా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.