బెల్లంపల్లి,(విజయక్రాంతి): జాతీయ 15వ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం బజార్ ఏరియా పాఠశాల విద్యార్థులతో స్థానిక తిలక్ క్రీడ మైదానం నుండి నెంబర్ 2 గ్రౌండ్ వరకు భారీ జాతీయ జెండాను ఊరేగింపుగా ప్రదర్శించారు. జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో ఈ జెండా ప్రదర్శన నిర్వహించారు. జాతీయ జెండా భారీ ప్రదర్శనలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ మాట్లాడుతూ... 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తహసిల్దార్ జోష్ణ, ఎంఈఓ లు పోచయ్య, మహేశ్వర్ రెడ్డి, పీడీలు రాజ్ మహమ్మద్, చాంద్ పాష, బండి రవి, పద్మ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.