calender_icon.png 17 March, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందానగర్‌లో భారీగా గంజాయి పట్టివేత

15-03-2025 12:00:00 AM

శేరిలింగంపల్లి, మార్చి 14(విజయక్రాంతి): చందానగర్ లో  సుమారు.4  లక్షల విలువ చేసే 6.47 కేజీల  గంజాయి పట్టుబడింది. పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ శివారు ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు శుక్రవారం ఎస్టిఎఫ్ దాడులు నిర్వహించగా  మహారాష్ట్ర నుంచి రైల్లో తీసుకువచ్చి  ఒకచోట సరుకు పంపకాలు చేసుకుంటుండగా  ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ కేసులో ఐదు సెల్ ఫోన్లతో పాటు  ఆరుగురు నిందితులు విన్ని, బిక్షు, చంటి, క్రాంతి,నిఖిల్,సాయికిరణ్ లను అరెస్ట్ చేశారు.నిందితులతో పాటు గంజాయిని శేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. గంజాయిని పట్టుకున్న ఎస్టిఎఫ్ టీమ్ లో సీఐ,ఎస్‌ఐ తో పాటు కానిస్టేబుల్ సంతోష్, యాదగిరి, హనీఫ్,లక్ష్మణ్, సాయికిరణ్, శంకరులు ఉన్నారు.