calender_icon.png 18 January, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా గంజాయి పట్టివేత

07-12-2024 01:50:57 AM

నలుగురు నిందితుల అరెస్ట్

మేడ్చల్, డిసెంబర్ 6: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారం మేరకు మాజీద్‌పూర్ వద్ద ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు వాహనాలు తనిఖీ చేయగా ఓ కారులో 25 కిలోల గంజా యి పట్టుబడింది. ఈ గంజాయిని ఒడి శా నుంచి నగరానికి తరలిస్తున్నట్లు తెలిసింది. కారులో ఏడుగురు వ్యక్తులుండగా.. అందులో నలుగురు మహి ళలున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు గంజాయిని, కారును సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు.

కార్వాన్‌లో నలుగురి అరెస్టు..

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (విజయక్రాంతి): కార్వాన్ టోలీచౌకీ మసీద్ ప్రాంతంలోని ఓ ఇంట్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు, ఎస్టీఎఫ్ టీం సభ్యులు శుక్రవారం నిర్వహించిన దాడిలో నలుగురు డ్రగ్ పెడ్లర్లను ఎండీ సలామ్, ఇంతియాజ్ ఖాన్, వంశీకృష్ణ, సోనును అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.3లక్షల విలువైన 2.1 కిలోల గంజాయి, 4 బైక్‌లు, 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని, ఈ కేసులో మొత్తం 31మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ తనిఖీల్లో ధూల్‌పేట్ సీఐ మధుబాబు, గోపాల్, ఎస్సైలు.. లలిత, భాస్కర్, పోలీసు సిబ్బంది భాస్కర్‌రెడ్డి, అజీమ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.