calender_icon.png 29 April, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర

29-04-2025 12:48:55 AM

పాదయాత్రలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ 

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 28: నగరంలో రాజ్యాంగ పరిరక్షణ ముగింపు పాదయాత్ర నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీగా నిర్వహించారు.ఈ పాదయాత్రలో ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్ యొక్క ప్రాధాన్యత తగ్గించే విధంగా బిజెపి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని వారు ఈ దేశ స్వాతంత్య్రం పోరాటం చేసి అనంతరం దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహానుభావులని కొనియాడారు. మార్కెట్ వెంకటేశ్వర దేవాలయం నుండి ప్రారంభమైన భారీ పాదయాత్ర టవర్ సర్కిల్ మీదుగా రాజీవ్ చౌక్ నుండి గాంధీ రోడ్డు లోని గాంధీ విగ్రహం వరకు సాగింది.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజక వర్గ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్,కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్,రుద్ర సంతోష్,వెలిచాల రాజేందర్ రావు,ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి,కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి,ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్,శ్రవణ్ నాయక్ మాజీ కార్పొరేటర్లు సిటీ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.