05-04-2025 12:04:19 AM
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడపర్తి రవి
ముషీరాబాద్, ఏప్రిల్ 4: (విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న బషీర్‌బాగ్ బాబూ జగ్జీవన్‌రావ్ విగ్రహం నుండి ట్యాంక్ బండ్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ ప్రజా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో సూట్ల బూట్లు, బ్లూ షర్ట్స్‌తో భారీ జై భీమ్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ రక్షణే లక్ష్యంగా ఈ ర్యాలీ ఉంటుందన్నారు.
ఈ దేశానికి ఏకైక రక్షణ భారత రాజ్యాంగం మాత్రమే అని అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సబ్బండ వర్గాల ప్రజలదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సూట్లు బూట్లు, బ్లూ షరట్స్, జై భీమ్ ర్యాలీ చైర్మన్ గా డాక్టర్ మీసాల మల్లేశం, రాష్ట్ర కో-ఆర్డినేటర్ గా అంబేద్కర్ సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు రాపోలు రాములు, కన్వీనర్లుగా గజ్జల్లి మల్లికార్జున్, డాక్టర్ బొమ్మెర స్టాలిన్, రింగు రాంబాబు, బోరెల్లి సురేష్, నక్క మహేష్, ఎర్రమల్ల మొగులయ్య, చాగంటి చంద్రశేఖర్, మారపాక సాయిలు, వరలక్ష్మి, వీరమణి, చిరుమర్తి రాజు, కోటగిరి ఉషారాణి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ నరేష్, జోగు గణేష్, గుర్రం కోటేష్ పాల్గొన్నారు.