calender_icon.png 15 January, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిర్యాలగూడలో భారీగా గంజాయి పట్టివేత

14-07-2024 05:37:39 AM

  • రెండు కార్లలో 1.40 క్వింటాళ్లు స్వాధీనం 
  • పోలీసుల అదుపులో సూర్యాపేట యువకుడు 
  • పరారీలో మరో నలుగురు నిందితులు

నల్లగొండ, జూలై 13 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ శివారులో భారీగా గంజాయి పట్టుబడింది. రెండు కార్ల లో తరలిస్తున్న 140.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువకుడిని సూర్యాపేట జిల్లా పెనుపహాడ్ మండలానికి చెందిన భూక్యా రాముగా గుర్తించారు. మిర్యాలగూడ నుంచి గం జాయి తరలిస్తున్నట్టు శనివారం మధ్యా హ్నం పోలీసులకు పక్కా సమాచారంతో పట్టణ శివారులో డీఎస్పీ రాజశేఖర్ రాజు సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వెళ్తున్న మహేంద్ర బొలెరో, మోరాజో వాహనాలను తనిఖీ చేస్తుండగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు పరారయ్యారు.

వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకొని కార్లను తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. నిందితుడిని విచారించగా పెనుపహాడ్ మం డలానికి చెందిన నూనవత్ జగన్, మంచ్యానాయక్ ప్రోద్బలంతో హైదరాబాద్, దేవ రకొండ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువస్తున్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిం దితులు నూనవత్ జగన్, నూనవత్ మం చ్యానాయక్, ఆంగోతు  నాగరాజు, బానోతు సాయిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని నియమించినట్టు చెప్పారు.