సీఎంకు నల్లగొండ ఎంపీ వినతి
నల్లగొండ, జనవరి 30 (విజయక్రాంతి) : రాష్ర్టంలోనే రెండో అతిపెద్దదైన పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు భారీగా నిధులు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డిని నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్‌లో సీఎంను కలిసి ఈ మేరకు ఆయన వినతిపత్రం అందించారు.
స్పందించిన సీఎం జాతరకు వచ్చే భక్తుల ఇబ్బంది లేకుండా మౌలిక వసతుల కల్పన, చేపట్టాల్సిన పనులకు నిధులు కేటాయించేందుకు వెంటనే అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వం తాత్కాలికంగా పనులు చేసి చేతులు దులుపుకున్నా ఈ సారి శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు., అవసరమైన చోట సీసీరోడ్లు నిర్మించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ రఘువీర్ రెడ్డికి యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్‌తోపాటు యాదవ సంఘం ముఖ్య నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.