100 మంది నుంచి రూ.30 కోట్లు వసూలు
జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 8: ప్రధానమంత్రి యోజన పేరుతో ఉద్యోగాలు, ఉపాధి కోసం రుణాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసిన మోసగాడిని బాధితులు శనివారం పోలీసులకు అప్పగించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌కు చెందిన వేణువర్మ గత నాలుగేళ్లుగా ప్రధాన మంత్రి యోజన ద్వారా రుణాలిప్పిస్తానని చెప్పడం జగిత్యాల, మంచిర్యాల ప్రాంతానికి చెం దాదాపు 100 మంది బంగారం, నగదును అప్పజెప్పారు. ఆ తర్వాత వేణువర్మ ముఖం చాటేయడంతో అతడి కోసం తీ గాలిస్తున్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రం తీన్ ఖాన్ చౌరస్తా వద్ద వేణువర్మను పట్టుకుని జగిత్యాల పోలీసులకు అప్పగించారు.