calender_icon.png 27 November, 2024 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం

27-11-2024 02:57:44 AM

4 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

ముంబై, నవంబర్ 26: సైబర్ నేరగాళ్ల చేతిలో అమాయక ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ముంబైలో డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ మహి ళ నుంచి రూ. 4 కోట్లను సైబర నేరగాళ్లు కొట్టేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం ముంబైకి చెందిన ఓ మహిళకు ఇటీవల వాట్సాప్‌లో వీడియోకాల్ వచ్చిం ది. ఓ వ్యక్తి ‘మీరు తైవాన్‌కు పంపిన పార్సిల్‌ను చెక్ చేశామని, అందులో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం.


పార్సిల్‌లో మీ వివరాలు దొరికాయి. మీపై మనీ లాండరింగ్ కేసు నమోదు అవుతుంది. మేం చెప్పిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి కేసు నుంచి బయ టపడండి. ఈ విషయం ఎవరితోనూ చెప్పవద్దు’ అని హెచ్చరించాడు. అనంతరం పోలీస్ డ్రెస్ వేసుకున్న ఓ వ్యక్తి వీడియోలో ప్రత్యక్షమై తనను తాను ఓ ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకుని, ఆమెతో మాట్లాడి బ్యాంకు వివరాలను తీసుకుకున్నాడు.


కొంత మనీని పంపాలని, విచారణలో నిర్దోషిగా తేలితే ఆ డబ్బును తిరిగి చెల్లిస్తామని చెప్పా డు. అనంతరం ఆమెను కొన్ని రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారు. ఆమె నుంచి చిన్న చిన్న పద్దుల రూపంలో మొత్తం రూ. 4 కోట్ల ను వసూలు చేశారు. రోజులు గడుస్తున్నా తాను చెల్లించిన డబ్బు తిరిగి రాకపోవడంతో సైబర్  పోలీసులను ఆశ్రయించింది. వారు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.