calender_icon.png 9 January, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్‌ గెలాక్సీ అపార్ట్మెంట్ లో భారీ అగ్నిప్రమాదం

31-12-2024 06:58:09 PM

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీ గెలాక్సీ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో స్థానికులు ఫైర్, పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... 5వ అంతస్తులోని ఫ్లాట్ లో గ్యాస్ సిలిండర్‌ పేలి మంటలు వ్యాపించినట్లు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో పై అంతస్తులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందని అన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.