calender_icon.png 20 January, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిన్ని మిల్లులో భారీ అగ్నిప్రమాదం

20-01-2025 08:15:32 PM

కోట్ల రూపాయల ఆస్తి నష్టం...

జైనూర్ (విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనుర్ మండల కేంద్రంలో సర్ రన్ జెన్యూన్ మిల్లులో సోమవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొనుగోలు చేసిన పత్తిని మిల్లు ఆవరణలో నిల్వ చేశారు. పత్తిని అమ్మకానికి తీసుకువచ్చిన ఐచర్ వాహనం అన్లోడ్ చేసే సమయంలో వాహనం సైలెన్సర్ నుండి వచ్చిన నిప్పు రవ్వలతో పత్తికి నిప్పు అంటుకుంది. ఒకసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. నిర్వాహకులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టంపై అధికారులు పంచనామా నిర్వహించి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కోట్ల రూపాయల నష్టం జరిగిందని జన్నింగ్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సంఘటన విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.