12 మంది మావోయిస్టుల మృతి
ఇద్దరు పోలీసులకు గాయాలు
మృతుల్లో ఇద్దరు తెలుగువారు?
కమాండర్ ఆత్రం లక్ష్మణ్ మృతి
ఆదిలాబాద్, జూలై 17 (విజయ క్రాంతి): మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ర్టలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ౧౨ మంది మావోయిస్టులు చనిపోయారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని వందోలీ గ్రామం వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మృతిచెందిన మావోయిస్టులో ఇద్దరు తెలుగువారు కూడా ఉన్నట్టు సమాచారం. వందోలీ గ్రామం వద్ద దట్టమైన అడవుల్లో ౧౫ మంది మావోయిస్టులు మకాం వేసినట్టు పక్కా సమాచారం అందటంతో ఓ డిఫ్యూటీ ఎస్పీ నేతృత్వంలో ఏడు సీ౬౦ స్పెషల్‌పార్టీ పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వారికి మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు చోటుచేసుకొన్నాయని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో ఒక ఎస్‌ఐ, మరో కానిస్టేబులు గాయపడ్డట్టు వెల్లడించారు. ఘటనా స్థలంలో పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నారు. అందులో AK 47 తుపాకులు మూడు, ఇన్సాస్‌లు 2తదితర ఆయుధాలు ఉన్నాయి. చనిపోయిన మావోయిస్టుల్లో తిప్పగడ్డ దళం ఇన్‌చార్జి డీవీసీఎం ఆత్రం లక్ష్మణ్ అలియాస్ విశాల్ అత్రం ఉన్నట్టు పోలీసులు తెలిపారు.