calender_icon.png 13 December, 2024 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

12-12-2024 01:22:39 AM

* నిందితుల అరెస్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి) : నగరంలో భుధవారం భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. సరూర్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలనగర్‌లో ఎస్టీఎఫ్ టీం లీడర్ నంద్యాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీల్లో.. స్కూటీపై గంజాయిని తరలిస్తున్న మహమ్మద్ సోయబ్ వద్ద 2.3కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో ఘటనలో.. డ్రగ్స్ విక్రేతలుగా మారిన నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ఎస్‌ఆర్‌నగర్ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ బీ టీమ్ సీఐ భిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు బృందం ఎస్‌ఆర్‌నగర్‌లోని సతీష్ బాయ్స్ హాస్టల్‌లో తనిఖీలు నిర్వహించారు. తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణకు చెందిన ఆదర్శ్, శ్రీజిత్, సంజయ్, అజయ్ (సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల) నుంచి 6.69గ్రాముల ఎండీఎంఏ, 8.58గ్రాముల హాషిష్‌ఆయిల్, 2.29గ్రాముల ఓజీకుష్ డ్రగ్స్ లభించాయి. ఇదే టీమ్ అమీర్‌పేట్‌లోని శ్రీనగర్‌కాలనీలో తనిఖీలు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న రవితేజ అనే వ్యక్తి వద్ద నుంచి 1.11కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మరోఘటనలో.. దుండిగల్ ప్రాంతంలో రెండు కేసుల్లో రూ.2.25లక్షల విలువైన గంజాయిని రంగారెడ్డి ఎస్టీఫ్ బీ టీమ్ సీఐ సుభాష్ టీమ్ పట్టుకుంది. ఒక కేసులో పోచంపల్లి ప్రాంతానికి చెందిన దీపక్ కుమార్, మహమ్మద్ షరీఫ్ ఇస్మాయిల్‌ను అరెస్ట్ చేశారు. మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించగా బీహార్‌కు చెందిన మిలాన్‌కుమార్, మనీష్‌కుమార్, అఖిలేష్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.13కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని పట్టుకున్న బృందంలో ఎస్టీఎఫ్ బీటీం సీఐ సుభాష్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, అఖిల్, సిబ్బంది ఉన్నారు.