ఇద్దరు నిందితుల అరెస్ట్, డ్రగ్స్ కొకైన్ స్వాదీనం..
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, వ్యాపారస్తులే లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు మాదాపూర్ లోని చందనాయక్ తండాలో తనిఖీలు నిర్వహించగా 23 గ్రాముల కొకైన్ విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుడు జెఎంజె కో లివింగ్ హాస్టల్ లో ఉంటూ కొకైన్ విక్రయిస్తున్నాడు. మరోచోట ఖానామెట్ లో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారించగా అతని వద్ద 11.14 గ్రాములు ఎండిఎంఏ డ్రగ్స్ పట్టుబడింది. బెంగుళూరు నుండి తెచ్చి ఇక్కడ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.