రూ.30 కోట్ల విలువైన టాబ్లెట్లు సీజ్
దిస్‌పూర్, జూలై 11 : అస్సాంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. బుధవారం రాత్రి జరిపిన తనిఖీల్లో రూ. 30 కోట్ల విలువైన లక్ష యాబా టాబ్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంగంజ్ ఎస్పీ పార్థ ప్రోతిమ్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని గంధరాజ్‌బరి ప్రాంతంలో బుధవారం రాత్రి యాంటీ నార్కోటిక్స్ జరిపిన ఆకస్మిక దాడుల్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. పక్కా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. లక్ష టాబ్లెట్లను తరలి స్తున్న వాహనాన్ని పట్టుకొని సీజ్ చేశారు. అనంతరం, నజ్ముల్ హుస్సే న్, ముత్లిబ్ అలీ అనే ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.