calender_icon.png 25 February, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు భారీ విరాళం

19-02-2025 12:00:00 AM

పెద్ద కొడఫ్గల్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం కోసం మంగళవారం మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి దంపతులు రూ.4.50 లక్షల విరాళాన్ని అందజేశారు. ప్రతాప్ రెడ్డి విగ్రహ గద్దె నిర్మాణానికి రూ.2 లక్షలు, ఆయన భార్య అరుణ జ్యోతి రూ.2.50 లక్షలు నిర్వాహకులకు అందజేశారు.

ఈ సందర్భంగా అనంతరం మాజీ ఎంపీపీ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుతో స్థానికుల ఆత్మాభిమానం పెంపొందించడమే కాకుండా స్నేహభావం ఆత్మవిశ్వాసం పెరుగుతుం దని, ఇట్టి నిర్మాణంలో భాగస్వామి నైతునందుకు గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ విగ్రహ నిర్మాణ సభ్యులు పాల్గొన్నారు.